Defence Jobs : పది పాస్ అయితే చాలు, రక్షణశాఖలో ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర రక్షణశాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 400 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఇందులో సివిల్ మోటార్ డ్రైవర్, క్లీనర్, క్యాటరింగ్ ఇన్ స

Defence Jobs : పది పాస్ అయితే చాలు, రక్షణశాఖలో ఉద్యోగాలు

Defence Jobs

Defence Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర రక్షణశాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 400 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఇందులో సివిల్ మోటార్ డ్రైవర్, క్లీనర్, క్యాటరింగ్ ఇన్ స్ట్రక్టర్, కుక్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 17 చివరి తేదీ. ఈ ఉద్యోగాలకు టెన్త్ పాస్ అయిన వారు అర్హులు. వయసు 18 నుంచి 25 ఏళ్లు ఉండాలి. కొన్ని పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు వయసున్న వారు అర్హులు. స్కిల్, ఫిజికల్, ప్రాక్టికల్ టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు. బెంగళూరులోని ఏఎస్‌సీ సెంటర్ సౌత్ కోసం ఈ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ఫామ్ అధికారిక నోటిఫికేషన్‌లోనే ఉంటుంది.

Jagananna Vidya Deevena : హైకోర్టు కీలక తీర్పు, ఇకపై డబ్బు నేరుగా వారి ఖాతాల్లోకే

మొత్తం ఖాళీలు – 400
సివిల్ మోటార్ డ్రైవర్ (పురుషులు మాత్రమే) – 115
క్లీనర్ – 67
కుక్ – 15
సివిలియన్ కేటరింగ్ ఇన్‌స్ట్రక్టర్ – 3
లేబర్ (పురుషులు మాత్రమే) – 193
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 7

సివిల్ మోటార్ డ్రైవర్- టెన్త్ క్లాస్ పాస్ కావాలి. హెవీ, లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి. మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి. పురుషులు మాత్రమే అర్హులు.

క్లీనర్- టెన్త్ పాస్ కావాలి.

కుక్- టెన్త్ పాస్ కావాలి. కుకింగ్‌లో అనుభవం ఉండాలి.

సివిలియన్ కేటరింగ్ ఇన్‌స్ట్రక్టర్- టెన్త్ పాస్ కావాలి. కేటరింగ్‌లో డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్స్ పాస్ కావాలి. కేటరింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి.

లేబర్- టెన్త్ పాస్ కావాలి. పురుషులు మాత్రమే అర్హులు.

JioPhone Next : రూ.500కే జియో స్మార్ట్ ఫోన్..?

మల్టీ టాస్కింగ్ స్టాఫ్- టెన్త్ పాస్ కావాలి.

దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్టు 28
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 17
ఎంపిక విధానం- రాతపరీక్షతో పాటు స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్.

వేతనం..
* సివిల్ మోటార్ డ్రైవర్, క్లీనర్, కుక్, సివిలియన్ కేటరింగ్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు రూ.19,900 + డీఏ
* లేబర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు రూ.18,000 + డీఏ.